ఈ కుర్రాడు భలే చాకు గురూ!

2 Apr, 2015 23:15 IST|Sakshi
ఈ కుర్రాడు భలే చాకు గురూ!

అతను చాకు లాంటి కుర్రాడు.. ఇంకా చెప్పాలంటే డైనమైట్ అంత పవర్‌ఫుల్ అన్నమాట. ఈ శక్తిమంతమైన పాత్రను పోషిస్తూ, దేవ కట్టా దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం ‘డైనమైట్’. ఈ చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో జరిగింది. విష్ణు, జేడీ చక్రవర్తి, రెండువేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా సన్నివేశాలు తీశారు. దీంతో టాకీపార్ట్ పూర్తయ్యింది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం వాయిస్ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ప్రచార చిత్రాన్నీ, వేసవికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు దర్శక, నిర్మాతలు.