ఆరు గంటలకు టేక్‌

25 Dec, 2019 06:43 IST|Sakshi
మణిరత్నం

ఉదయం మూడు గంటలకే మేకప్‌ చైర్‌లో కూర్చుని, ఆరు గంటలకల్లా షూట్‌కు సిద్ధంగా ఉంటున్నారట కార్తీ, ‘జయం’ రవి. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ కాని  దర్శకుడు మణిరత్నం ఆర్డర్‌ ఇది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా ఆయన దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ థాయ్‌ల్యాండ్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్తీ, ‘జయం’ రవిలపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

సూర్యోదయం సన్నివేశాలను  తీస్తున్నారట మణిరత్నం. ఇది చారిత్రాత్మక చిత్రం కావడంతో నటీనటులు గెటప్పులు  భిన్నంగా ఉంటాయి. అందుకే కార్తీ, ‘జయం’ రవి ఉదయం మూడు గంటలకల్లా మేకప్‌ రూమ్‌కి ఎటెండ్‌ అయిపోతున్నారు. అలాగే సహజమైన లైటింగ్‌లో సన్నివేశాలను తీయాలని మణిరత్నం ప్లాన్‌ చేసుకున్నారట. అందుకని ఉదయం 6 గంటలకు ఫస్ట్‌ షాట్‌కి టేక్‌ చెబుతున్నారట. సూర్యాస్తమయం లోపు షూటింగ్‌ ప్యాకప్‌ చెబుతున్నారని సమాచారం. ఈ భారీ షెడ్యూల్‌ ఫిబ్రవరి వరకు థాయ్‌ల్యాండ్‌లోనే జరుగుతుందట. ఈ షెడ్యూల్‌ ముగిసిన తర్వాత త్రిష, విక్రమ్‌లపై సన్నివేశాలను ప్లాన్‌ చేశారట. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు