‘నవాబ్‌’ కూడా నిజజీవిత పాత్రల నేపథ్యమే..!

20 Sep, 2018 12:33 IST|Sakshi

లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నవాబ్‌. మణి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కుతోంది. అయితే యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మణిరత్నం గత చిత్రాలు ఎక్కువగా పురాణేతిహాసాలు, చారిత్రక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కినవే.

ప్రేమకథా చిత్రాలు తప్ప మణి దర్శకత్వంలో తెరకెక్కిన ఇతర చిత్రాలు రామాయణ మహాభారతాలు, తమిళ రాజకీయ నాయకుల కథల ఇన్పిపిరేషన్‌తో తెరకెక్కించారు. తాజా చిత్రం నవాబ్‌ కూడా అలా నిజజీవిత పాత్రల నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తమిళ రాజకీయాల నేపథ్యంలోనే ఈ సినిమా రూపొందించారని ప్రధాన పాత్రలైన ప్రకాష్‌ రాజ్‌, అరవింద్‌ స్వామిల పాత్రలు తమిళ నాయకులను గుర్తు చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై మణి టీం మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు