మణికర్ణిక ఫస్ట్‌ లుక్‌.. అదిరింది!

15 Aug, 2018 08:11 IST|Sakshi

టాలీవుడ్ డైరెక్టర్‌ క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం ‘మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’.  ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటోంది. 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్రయూనిట్‌ ఫస్ట్‌లుక్‌ పొస్టర్‌ను విడుదల చేసింది. యుద్ద సన్నివేశాల్లోని కంగనా గుర్రపు స్వారీ ఫోజ్‌ అచ్చం ఝాన్సీ లక్ష్మీ భాయ్‌లా ఉండటంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  దీంతో ఈ చిత్రంపై అంచనాలు మిన్నంటాయి.

పలు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీకి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ సమకూర్చారు. మార్చిలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రిపబ్లిక్‌ డే సందర్భంగా 2019 జనవరి 25న రిలీజ్ చేయనున్నారు. గతేడాది మేలో షూటింగ్‌ ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. ఈ ఏడాది సమ్మర్‌లో రీలీజ్‌ కావాల్సి ఉంది. అయితే కొన్ని కీలక సన్నివేశాల అవుట్‌ పుట్‌పై అసంతృప్తితో ఉన్న క్రిష్‌. రీషూట్‌ చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే రిలీజ్‌ ఆలస్యం అయ్యింది.

మరిన్ని వార్తలు