మమ్మల్ని అలా చూడాలనుకోరు.. అమ్మడు!

12 May, 2017 19:54 IST|Sakshi
మమ్మల్ని అలా చూడాలనుకోరు.. అమ్మడు!
మమ్మల్ని అలా చూడాలనుకుంటున్నారనడం చాలా తప్పు అంటోంది నటి మంజిమామోహన్‌. అచ్చంయన్బదు మడమయడా చిత్రం ద్వారా సంచలన నటుడు శింబుకు హీరోయిన్‌గా కోలీవుడ్‌కు దిగుమతి అయిన కేరళా కుట్టి మంజిమామోహన్‌. మాతృభాషలో ఒరు వడక్కన్‌ సెల్ఫీ చిత్రంతో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు ఇప్పుడు తమిళంలో బిజీ నాయకిగా మారింది. ఈ భామను దర్శకుడు గౌతమ్‌మీనన్‌ ఏక్‌ ధమ్‌న తమిళం, తెలుగు భాషల్లో నాయకిని చేసేశారు. ప్రస్తుతం విక్రమ్‌ప్రభుకు జంటగా నటిస్తున్న క్షత్రియన్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతుండగా, తాజాగా ఉదయనిధిస్టాలిన్‌తో ఇప్పడై వెల్లుమ్‌ చిత్రంలో నటిస్తోంది.
 
ఈ అమ్మడికి ఫేస్‌బుక్‌లో అభిమానుల ఫాలోయింగ్‌ అధికంగానే ఉందట.అయితే అందరూ ఒకలా ఉండరు కదా ఒక తుంటరి హీరోయిన్లను నగ్నంగా చూడడానికే ప్రేక్షకులు ఆసక్తి చూపుతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట.అంతే అతని మాటలకు మంజిమామోహన్‌కు కోపం కట్టలు తెంచుకొచ్చిందట.అంతే అదే ఫేస్‌బుక్‌లో అతన్ని చెడామడా తిట్టేసిందట. దీంతో ఆ వ్యక్తి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌నే క్లోజ్‌ చేసేశాడట.

దీని గురించి నటి మంజిమామోహన్‌ తెలుపుతూ ప్రేక్షకుడు హీరోయిన్లను నగ్నంగా చూడడానికి థియేటర్లకు వస్తారనడం చాలా తప్పు అని, అదే విధంగా అరకొర దుస్తుల్లో చూడాలని ప్రేక్షకులు కోరుకోరని అంది. మంచి కథా చిత్రాలను చూడడానికే వారు ఆసక్తి చూపుతారని పేర్కొంది. ఈ అమ్మడి అభిప్రాయాన్ని చాలా మంది అభిమానులు లైక్‌ చేస్తూ అవును మంచి కథా చిత్రాలను చూడాలనే తాము ఆశిస్తున్నామని, కథానాయికల్ని కురచ దుస్తుల్లో చూడాలనుకోవడం లేదని అంటున్నారట. మొత్తం మీద నటి మంజిమామోహన్‌ ఇలా కూడా ప్రచారం పొందేస్తోంది.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా