‘మన్మథుడు 2’ ఫ్రీమేకా..?

18 Jun, 2019 11:41 IST|Sakshi

కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నటుడు రాహుల్ రవీంద్రన్‌ ఈ సినిమాకు దర్శకుడు. 2002లో రిలీజ్‌ అయిన మన్మథుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఫ్రెంచ్‌ సినిమా ఫ్రీమేక్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది.

2006లో రిలీజ్‌ అయిన ఫ్రెంచ్‌ మూవీ ‘ప్రీట్-మోయి టా మెయిన్’ లైన్‌తోనే మన్మథుడు 2ను తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో 43 ఏళ్ల వ్యక్తిని కుటుంబం సభ్యులు పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుంటారు. అతను మాత్రం ప్రేమ, పెళ్లి లాంటి కమిట్‌మెంట్స్ ఏవీ లేకుండా అమ్మాయిలతో సరదాగా గడిపేస్తుంటాడు. మన్మథుడు 2 టీజర్‌ లోనూ ఇదే కాన్సెప్ట్‌ కనిపించటంతో ఈ సినిమా రీమేక్‌గా ప్రచారానికి మరింత బలం చేకూరినట్టైంది. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు