‘ఆ రెండు ఒకే రోజు జరగటం యాదృచ్ఛికం’

18 Nov, 2019 20:21 IST|Sakshi

ప్రపంచ మాజీ సుందరి మానుషి చిల్లర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మానుషి తొలి చిత్రంతోనే ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌కు జోడిగా నటించే అవకాశం దక్కించుకున్నారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘పృథ్వీరాజ్‌’ సినిమాలో చక్రవర్తి ప్రేమికురాలు రాణి సంయోగితగా ఆమె కనిపించనున్నారు. అయితే చిత్ర షూటింగ్‌లో భాగంగా మానుషి తన తొలి హింది సినిమా ‘పృథ్వీరాజ్‌’ మొదటి షాట్‌ తీయటంలో సోమవారం పాల్గొంది. దీంతో మానుషి తాను మొదటిసారి సినిమాల్లో నటించటం కోసం కెమెరా ముందుకు వచ్చిన ఈ రోజు (నవంబర్‌ 18). అలాగే రెండేళ్ల కిందట ‌2017లో ప్రపంచ సుందరిగా కిరీటం ద​క్కించుకున్నది ఇదే రోజు అవడాన్ని చాలా యాదృచ్ఛికంగా భావిస్తున్నానని మానుషి సోషల్‌ మీడియాలో పంచుకుంది. రెండు ముఖ్యమైన వియయాలు ఒకే రోజు జరగటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. నవంబర్‌ 18 తనకు చాలా ప్రత్యేకమైన రోజని తెలిపారు. తన జీవితంలో మైలురాయిగా నిలిచిపోయే రెండు అద్భుతమైన సంఘటనలు ఒకేరోజు ( నవంబర్‌18) చోటుచేసుకోవటం పట్ల థ్రిల్‌గా ఫీల్‌ అవుతున్నాని మానుషి తెలిపారు.

Feeling blessed 🙏🏻💫 #Prithviraj puja #Diwali2020 @akshaykumar #DrChandraprakashDwivedi @yrf @prithvirajmovie

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

తాను చాలా మందికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పారు. నటీగా తనను తాను నిరుపించుకోవడానికి ఎంతో కష్టపడ్డానని తెలిపారు. అదేవిధంగా హార్డ్‌ వర్క్‌ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చారు. తనకు, తాను నటించిన చిత్రం ‘పృథ్వీరాజ్‌’కు ఈ విశ్వం టన్నుల కొద్ది అదృష్టాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు మానుషి తెలిపారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. ఐశ్వర్యారాయ్‌, ప్రియాంక చోప్రా మాదిరి మానుషి కూడా సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. దర్శకుడు చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కె ‘పృథ్వీరాజ్‌’ 2020 దీపావళీకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు