మీటూని  పబ్లిసిటీ కోసం  వాడుకుంటున్నారు

28 Nov, 2018 00:28 IST|Sakshi

‘‘ప్రస్తుతం నడుసున్న ‘మీటూ’ ఉద్యమం చాలా నిజమైనది. ఇలాంటి ఉద్యమాలే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలకు అద్దం పడుతుంటాయి’’ అని అన్నారు ప్రియమణి. ‘మీటూ’ ఉద్యమం గురించి ప్రియమణి మాట్లాడుతూ – ‘‘చాలా మంది స్త్రీలు బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను ధైర్యంగా పంచుకుంటున్నారు.

అలానే మిగతా స్త్రీలు కూడా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడాలి. ఇలా ప్రతి ఒక్కరూ గొంతు విప్పి మాట్లాడగలిగితే ఇలాంటి విషయాల మీద మిగతావారిలో అవగాహన తీసుకురావచ్చు. పని ప్రదేశాల్లో సురక్షిత వాతావరణాన్ని నెలకొల్పొచ్చు. అలాగే ‘మీటూ’లాంటి మంచి కార్యక్రమాన్ని కొందరు తప్పుగా ఉపయోగించుకుంటున్నారు. మీటూ అనేది ఓ జెన్యూన్‌ ప్లాట్‌ఫారమ్‌. పబ్లిసిటీ కోసం దీనిని ఉపయోగించుకుంటున్నారు’’ అని పేర్కొన్నారామె.  

మరిన్ని వార్తలు