పద్మావతికి మావోయిస్టులు మద్దతు

9 Dec, 2017 16:57 IST|Sakshi

ముంబయి : షూటింగ్‌ సమయంలో పలు అడ్డంకులు ఎదుర్కొని తీరా చిత్రీకరణ పూర్తయ్యాక విడుదలకు ముందు వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్‌ చిత్రం పద్మావతికి మావోయిస్టుల మద్దతు లభించింది. సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంటనే విడుదల చేయాలంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు.

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని, సినిమా విడుదలను ఎవరూ అడ్డుకోవద్దని తెలిపారు. ఈ మేరకు చత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ, బస్తర్‌ జిల్లాలో పోస్టర్లు అంటించారు. కరపత్రాలు ముద్రించారు. ప్రభుత్వం వెంటనే ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకొని విడుదల చేయాలని, స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని అందులో డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆ ప్రాంతాల్లోని పోలీసులు కూడా ధ్రువీకరించారు. 
 

మరిన్ని వార్తలు