కొత్తగా ఉంటుంది

5 Jan, 2018 02:17 IST|Sakshi

‘‘మా సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ సంస్థలో చాలా సినిమాలకు రామకృష్ణ సహాయ దర్శకుడిగా పని చేసాడు. తనలో మంచి ప్రతిభ ఉంది. ‘మర్లపులి’ ట్రైలర్‌ చాలా బాగుంది. ఈ చిత్రంలో కొత్తదనం కనిపిస్తోంది. అన్ని వర్గాల వారికి ఈ సినిమా నచ్చుతుంది’’ అని నిర్మాత వాకాడ అప్పారావు అన్నారు. అర్చనవేద, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో వరుణ్‌సందేశ్‌ ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మర్లపులి’. డి.రామకృష్ణ దర్శకత్వంలో భవానీశంకర్, బి.సుధాకర్‌ రెడ్డి, ఐ.యస్‌. దినకర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి విడుదల చేశారు.

‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. రామకృష్ణ, టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు సురేందర్‌రెడ్డి. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. అర్చనవేద పాత్ర కొత్తగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్ర చేస్తున్నారామె. నటిగా మంచి గుర్తింపు వస్తుంది. వరుణ్‌ సందేశ్‌ పాత్ర మా సినిమాకే ప్రత్యేక ఆకర్షణ. పోసాని పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు రామకృష్ణ. తాగుబోతు రమేష్, భానుశ్రీ, చమ్మక్‌ చంద్ర, రమణారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం బి.ఎస్‌. రెడ్డి, కెమెరా: ఎం. మురళీ కృష్ణ.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు