నమ్మకంగా ఉన్నాం

27 May, 2019 02:52 IST|Sakshi
శ్రీకాంత్, అభయ్‌

శ్రీకాంత్‌ విభిన్న పాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్‌’. ఈ చిత్రంతో అభయ్‌ హీరోగా పరిచయమవుతున్నారు. జై రాజసింగ్‌ దర్శకత్వం వహించారు. మేఘాచౌదరి, రష్మి సమాంగ్‌ కథానాయికలు. ఏవీఎల్‌ ప్రొడక్షన్‌పై అభయ్‌ అడక నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. సమాజానికి మంచి సందేశం కూడా ఉంటుంది. ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. టీజర్‌ 20 లక్షల వ్యూస్‌ సాధించి, అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే 20 లక్షల వ్యూస్‌ రావడంతో ఈ చిత్రంపై ముందు నుంచి మాకు ఉన్న నమ్మకం మరింత పెరిగింది. ఇటీవల హిట్స్‌గా నిలిచిన చిత్రాల జాబితాలో మా ‘మార్షల్‌‘ కూడా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల, కెమెరా: స్వామి ఆర్‌. యమ్‌.
 

మరిన్ని వార్తలు