నా సినిమాల్లో మార్షల్‌ బెస్ట్‌

12 Sep, 2019 01:14 IST|Sakshi
వరికుప్పల యాదగిరి, జై రాజా సింగ్, శ్రీకాంత్, అభయ్, మేఘా చౌదరి

– శ్రీకాంత్‌

‘‘మార్షల్‌’ సినిమాతో అభయ్‌ నటుడిగా, నిర్మాతగా తెలుగు తెరకు పరిచయం అవడం ఆనందంగా ఉంది. ఈ మధ్య కాలంలో నేను చేసిన సినిమాల్లో ఈ సినిమా బెస్ట్‌ అని చెప్పొచ్చు. సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నా’’ అని శ్రీకాంత్‌ అన్నారు. అభయ్, మేఘా చౌదరి జంటగా శ్రీకాంత్‌ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్‌’. జై రాజాసింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో అభయ్‌ తన సొంత బ్యానర్‌లో నిర్మించారు. ఈ సినిమా రేపు విడుదలవుతోంది.హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో అభయ్‌ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమిది.

సాంగ్స్, ఫైట్స్, మదర్‌ సెంటిమెంట్‌.. ఇలా అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి. స్వామిగారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నేను బాగా నటించడానికి శ్రీకాంత్‌గారు సపోర్ట్‌ చేశారు. ఆయనకి, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి’’ అన్నారు. ‘‘మొదటి సినిమాతోనే అభయ్‌ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాడు. భవిష్యత్తులో అతను నటుడిగా మరో మెట్టు ఎక్కాలి’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ‘‘కథ విన్న వెంటనే ఈ సినిమా చేయడానికి అభయ్‌ ఒప్పుకున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ చేసిన శ్రీకాంత్‌గారికి థ్యాంక్స్‌. కొత్త పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.. ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు జై రాజాసింగ్‌.

మరిన్ని వార్తలు