ఇద్దరి గురి ఎవరిపై?

10 Mar, 2018 00:29 IST|Sakshi
నాగార్జున,మైరా సరీన్‌

ఫుల్లీ లోడెడ్‌ గన్‌తో టార్గెట్‌పై కాన్సంట్రేట్‌ చేశారు నాగార్జున. ఆన్‌ డ్యూటీలో ఈ ఆఫీసర్‌ ఏ విధంగా టార్గెట్‌ను రీచ్‌ అయ్యాడో తెలుసుకోవాలంటే మాత్రం ‘ఆఫీసర్‌’ సినిమా చూడాల్సిందే. నాగర్జున హీరోగా కంపెనీ పతాకంపై సుధీర్‌ చంద్రతో కలిసి రామ్‌గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘ఆఫీసర్‌’. మైరా సరీన్‌ ఫీమేల్‌ లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. క్లైమాక్స్‌ షూటింగ్‌ ముంబైలో జరుగుతుంది.

‘‘నా గన్‌తో పాటు మైరా సరీన్‌ గన్‌ కూడా ‘ఆఫీసర్‌’ సినిమా కోసం ఫుల్‌గా లోడై ఉంది. మే 25న థియేటర్స్‌లో షూట్‌ చేస్తాం’’ అని పేర్కొన్నారు నాగార్జున. అంతేకాదు.. ఆన్‌లొకేషన్స్‌ ఫొటోలను షేర్‌ చేశారు. వీటిని చూసిన అభిమానులు నాగ్‌ మరో హిట్‌పై గురిపెట్టాడు అని అనుకుంటున్నారు. ‘‘మైరా సరీన్‌ యాక్టింగ్‌ చూసి నాగార్జున, నేను ఇంప్రెస్‌ అయ్యాం. సరీన్‌కు ఇది ఫస్ట్‌ మూవీ అంటే నమ్మబుద్ధి కావడం లేదు’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆఫీసర్‌ చిత్రాన్ని మే 25న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు