అమ్మోరు గుర్తుకొస్తోంది – నందినీరెడ్డి

6 Dec, 2017 00:45 IST|Sakshi

‘నరసింహ’ చిత్రంలో నీలాంబరి, ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రమ్యకృష్ణ. తాజాగా ‘మాతంగి’గా ప్రేక్షకులను అలరించబోతున్నారు రమ్య. ఆమె ప్రధాన పాత్రలో కన్నన తమ్మార్కులమ్‌ దర్శకత్వంలో మలయాళ హిట్‌ మూవీ ‘మాతంగి’ని అదే పేరుతో రమ్యకృష్ణ సోదరి వినయకృష్ణన్‌ తెలుగులోకి అనువదించారు. ఈ నెల 15న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు.

దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘రమ్యగారికి వినయ బిగ్గెస్ట్‌ క్రిటిక్‌. ఆమెకు ఏదీ త్వరగా నచ్చదు. ‘మాతంగి’ని ఆమె తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారంటే ఈ చిత్రంలో ఏదో విషయం ఉంటుంది. రమ్యగారి ‘మాతంగి’ లుక్‌ చూస్తుంటే ‘అమ్మోరు’ సినిమా గుర్తుకొస్తోంది’’ అన్నారు. ‘‘తెలుగులో మేం తొలిసారి చేస్తున్న చిన్న ప్రయత్నం ‘మాతంగి’. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఎడిట్‌ చేసింది కృష్ణవంశీగారే’’ అన్నారు రమ్యకృష్ణ. ఈ వేడుకలో రమ్యకృష్ణవంశీల తనయుడు రిత్విక్‌ పాల్గొన్నాడు. నటుడు ఓంపురి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి రచన: వెన్నెలకంటి, సంగీతం: రతీష్‌ వేగ. 

మరిన్ని వార్తలు