మే 4న డైరెక్టర్స్‌ డే

30 Apr, 2018 01:06 IST|Sakshi

మే 4... దర్శకరత్న డా. దాసరి నారాయణరావు పుట్టినరోజు. నూట యాభైకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. దాసరి భౌతికంగా దూరమైనా తాను అందించిన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు. మే 4న ఆయన జయంతిని పురస్కరించుకుని ఆ రోజుని ‘డైరెక్టర్స్‌ డే’గా ప్రకటించింది తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం.

‘‘స్వర్గీయ దాసరి నారాయణరావుగారి జయంతి సందర్భంగా మే 4న ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో వేడుక   నిర్వహించనున్నాం. తెలుగు దర్శకుల సంఘం సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు