మీటూ కమిటీ

21 Apr, 2019 08:52 IST|Sakshi

పెరంబూరు: దక్షిణ భారత నటీనటుల సంఘం ఆధ్వర్యంలో మీటూ కమిటీని ఏర్పాటు చేశారు. సమీప కాలంగా దక్షిణాదిలో నటీమణులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద కలకలాన్నే సృష్టించిన విషయం తెలిసిందే. నటి శ్రీరెడ్డిలాంటి కొందరు తారలు పరిశ్రమలోని ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసి వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ మధ్య నటి నయనతారపై సీనియర్‌ నటుడు రాధారవి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి, అవి ఎంతతీవ్ర పరిణామాలకు దారి తీసిందో తెలిసిందే.

అంతే కాదు తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నటి నయనతార తీవ్రంగా స్పందిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విశాల్‌ కమిటీని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోగలరా? అని దక్షిణ భారత నటీనటులు సంఘాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో దక్షిణ భారత నటీనటుల సంఘం( నడిగర్‌సంఘం)  మీటూ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నాజర్‌ అధ్యక్షుడిగా వ్వవహరిస్తారు. కమిటీ సభ్యులుగా విశాల్, కార్తీ, పూచీ మురుగన్‌ నటీమణులు కుష్బు, రోహిణి, సుహాసినిలతో పాటు ఒక సామాజికవేత్త, న్యాయవాది అంటూ 8 మందిని నియమించారు. ఈ కమిటీ సినీరంగంలోని మహిళలకు రక్షణగా పని చేస్తుంది. ఈ కమిటీని ఏర్పాటు చేయడానికి చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులే కారణం అని తెలిసింది.

మరిన్ని వార్తలు