‘మూస్కొని పరిగెత్తమంది’

19 Oct, 2019 14:50 IST|Sakshi

‘మీకు మాత్రమే చెప్తా’ టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచేసిన చిత్రయూనిట్‌.. ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌లతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అయింది. దీంతో ఆ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ట్రైలర్‌ సక్సెస్‌ జోరులోనే మరో సర్‌ప్రైజ్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. సినిమా తొలి లిరికల్‌ సాంగ్‌ను తాజాగా విడుదల చేసింది. ‘ఈ రోజు పొద్దున్నేపెద్ద పులి నన్నే ఎందుకో తరుముతోంది. అరె ఎందుకని తిరగి నేనడిగిగా.. పులి మూస్కోని పరిగెత్తమంది’అంటూ సాగే గీతాన్ని రాకేందు మౌళి రచించగా శివకుమార్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేశారు. సింగర్‌ రేవంత్‌ ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

పెళ్లి చూపులు సినిమాతో తనను హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ‘మీకు మాత్రమే చెప్తా’తో హీరోగా మార్చాడు టాలీవుడ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్‌ దేవరకొండ ఈ చిత్రన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనిలో భాగంగా మూవీ ప్రమోషన్స్‌ను కూడా చిత్రయూనిట్‌ ప్రారంభించింది. ప్రిన్స్‌ మహేశ్‌ బాబుతో ట్రైలర్‌ లాంచ్‌ చేయించి సినిమాపై హైప్‌ను క్రియేట్‌ చేశాయి. ఇక ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తుంటే.. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 

మరిన్ని వార్తలు