ఫ్యాన్స్‌ అస‌భ్య పోస్టుల‌పై పోలీసుల ఫైర్‌

3 Jun, 2020 19:25 IST|Sakshi

 మీరా చోప్రాకు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ అండ‌

త‌న‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో వేధిస్తున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాలీవుడ్‌ న‌టి మీరా చోప్రా పోలీసుల‌ను ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. కాగా సోమ‌వారం నాడు అభిమానుల‌తో చిట్‌చాట్ చేసిన సంద‌ర్భంలో ఎన్టీఆర్ ఎవ‌రో తెలియ‌దు అన‌డంతో ఈ వివాదం రాజుకుంది. తాన‌స‌లు ఆ హీరో ఫ్యాన్ కాద‌న్నందుకు ఆమెపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. దూష‌ణ‌ల‌కు దిగుతూ బెదిరింపుల‌కు కూడా పాల్ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఆమె వాటి స్క్రీన్‌షాట్ల‌ను సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ట్వీట్ చేసింది. త‌న‌పై అస‌భ్య‌క‌రంగా కామెంట్లు చేస్తున్న ఫ్యాన్స్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. ట్వీట్ల ఆధారంగా సైబ‌ర్ క్రైమ్‌ పోలీసులు 67 యాక్ట్‌, 509 ఐపీసీ సెక్ష‌న్ల కింద హీరో అభిమానుల‌పై కేసు న‌మోదు చేశారు. (ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై హీరోయిన్‌ మీరా ఫిర్యాదు)

అస‌భ్యంగా కామెంట్లు చేసిన వారి ట్విట‌ర్ అకౌంట్ల‌ను గుర్తింంచే ప‌నిలో ప‌డ్డారు. అస‌భ్యంగా ఉన్న పోస్టుల‌ను షేర్ చేసినా, వాటిపై కామెంట్ చేసినా వారిపై కేసు న‌మోదు చేసి క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ హెచ్చ‌రించారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై గాయ‌ని చిన్మ‌యితో పాటు, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ రేఖా శ‌ర్మ సైతం మీరా చోప్రాకు మ‌ద్ద‌తు ప‌లికారు. మీరా చోప్రాపై దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేసిన ట్విట‌ర్ అకౌంట్ల‌ను తొల‌గించాల్సిందిగా ట్విట‌ర్‌ను కోరారు. (హీరోయిన్‌కు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వేధింపులు!)

మరిన్ని వార్తలు