అమ్మచాటు కొడుకులు ఈ టాప్ హీరోలు

24 Apr, 2016 16:54 IST|Sakshi
అమ్మచాటు కొడుకులు ఈ టాప్ హీరోలు

ఒకరి దగ్గర కోట్లాది రూపాయల డబ్బు ఉండొచ్చు. వేసుకోవడానికి వందలకొద్దీ కోట్లుండొచ్చు.. ఖరీదైన బంగళాలు, విలాసాలకు బోలెడంత డబ్బు ఉండొచ్చు. ఇంకొకరి దగ్గర ఇవేవీ లేకున్నా ఒక్క అమ్మ ఉంటే చాలు! అవును. అమ్మతో కలిసుండటం, అమ్మను కలిగి ఉండటంలోని గొప్పతనాన్ని 'మేరే పాస్ మా హ:' అనే ఒకేఒక్క డైలాగ్ తో సోదరుడు అమితాబ్ కు తెలియజేస్తాడు 'దీవార్' సినిమాలో శశీకపూర్. ఆ డైలాగ్ బాలీవుడ్ లో ఎంత ఫేమసో,  కొందరు హాలీవుడ్ హీరోల నిజజీవితాల్లోనూ అంతే.

అమ్మ ఒడి అంటే... ఒక పాఠశాల. ఆ పాఠశాలలో ఎన్నో కథలు వినిపిస్తాయి. అవి కథలు మాత్రమే కాదు... జీవితాన్ని సక్రమమైన దారిలో నిర్మించుకోవడానికి అవసరమైన సాధనాలు. అలా అమ్మ కూచులుగా జీవితం ప్రారంభించి, అమ్మే ఇన్ స్పిరేషన్ గా విజయాలు సాధించామంటున్నారు ప్రముఖ హాలీవుడ్ హీరోలు టామ్ క్రూస్, బ్రాడ్ పిట్, జానీ డెప్, లియోనార్డో తదితరులు. తల్లిచాటు కొడుకులుగా పేరుపొందిన వీళ్లు తమ మాతృమూర్తులతో కలిసున్నప్పటి ఫొటోలివి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి