ఏంటి బావ పెళ్లంట.. వాళ్లు మోసం చేశారు!

24 May, 2020 13:11 IST|Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రేమ, పెళ్లి విషయాలు హాట్‌టాపిక్‌గా మారాయి. బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు ఒక్కొక్కరు ఫుల్‌ స్టాప్‌ పెడుతున్నారు. దగ్గుబాటి రానా నుంచి మొదలు నిఖిల్‌, నితిన్‌లతో పాటు మరికొందరు తమ బ్యాచ్‌లర్‌ జీవితానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెగా హీరోలు సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌తేజ్‌ల మధ్య సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. యూట్యూబ్ థంబ్ నేల్‌కు సంబంధించి ఓ ఫోటోను సాయిధరమ్‌ తేజ్‌ షేర్‌ చేస్తూ ‘ఏంటి బావ నీకు పెళ్లంట’ అంటూ వరుణ్‌ను అడిగాడు. 

దీనికి సమాధానంగా ‘ఆ.. దానికి ఇంకా సమయం ఉంది కానీ.. మన బ్యాచ్‌లర్‌ గ్రూప్‌ నుంచి రానా, నితిన్‌లు తప్పుకున్నారు. పెళ్లి చేసుకోము మేము ఎప్పుడూ సింగిల్‌ అంటూనే మన గ్రూప్‌ నుంచి బయటకి వెళ్లిపోయారు’అంటూ వరుణ్‌ బదులిచ్చాడు. ఇక మధ్యలో కలగజేసుకున్న నితిన్‌ ‘బాధపడకండి బ్రదర్స్‌. మీ నంబర్‌ కూడా త్వరలోనే వస్తుంది. అవన్నీ కాదు కానీ అప్పుడెప్పుడో నా బర్త్‌డేకి గిఫ్ట్‌ ఇస్తా, లాక్‌డౌన్‌ వల్ల ఆగిపోయా అన్నావ్‌, గిఫ్ట్‌ ఎక్కడా, ఎప్పుడిస్తావ్‌, నేను వెయిటింగ్‌ సాయి తేజ్‌’ అంటూ నితిన్‌ పేర్కొన్నాడు. 

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రంలోని పాటను విడుదల చేయాల్సింది నువ్వే(నితిన్‌) డార్లింగ్‌. సోమవారం ఆ పాట రిలీజ్‌ చేయ్‌. ఈ పాట మా సింగిల్స్‌కు అంకితం’ అంటూ సాయితేజ్‌ నితిన్‌కు బదులిచ్చాడు. ఇక ఈ హీరోల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక వరుణ్‌ తేజ్‌ కిరణ్‌ కొర్పపాటి దర్వకత్వంలో బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక సాయి తేజ్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’తో బిజీగా ఉన్నాడు. 

చదవండి:
‘సెలబ్రిటీ హోదా’ అనేది ఒక అదృష్టం
మేకప్‌.. మేకోవర్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా