మంచి  నిర్ణయం

12 Feb, 2019 00:55 IST|Sakshi

‘విజేత’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌. సోమవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కల్యాణ్‌ దేవ్‌ నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రంలోని లుక్‌ను రిలీజ్‌ చేశారు చిత్రబృందం. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు.

పుట్టినరోజు సందర్భంగా మంచి పని చేయాలనుకున్న కల్యాణ్‌ దేవ్‌ అవయవ దానం చేయడానికి నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ‘‘ఈ భూమిని వదిలి వెళ్లేటపుడు ఏం తీసుకెళ్తామని?  అందుకే ఈ స్పెషల్‌ డే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని పేర్కొన్నారు కల్యాణ్‌ దేవ్‌.  

మరిన్ని వార్తలు