మెగాస్టార్ విడుదల చేసిన 'ద్వారక' మోషన్ పోస్టర్!

15 Oct, 2016 19:10 IST|Sakshi
మెగాస్టార్ విడుదల చేసిన 'ద్వారక' మోషన్ పోస్టర్!

హైదరాబాద్: విజయ్‌ దేవరకొండ, పూజ జవేరి జంటగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌(ఆర్‌.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్‌ సినిమా బ్యానర్‌పై శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'ద్వారక'. ఈ సినిమా మోషన్ పోస్టర్ను మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా సెట్స్లో శనివారం విడుదల చేశారు.

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

తన అభిమాన నటుడైన చిరంజీవి సినిమా మోషన్ పోస్టర్ను లాంచ్ చేయడం పట్ల హీరో విజయ్ దేవరకొండ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెళ్ళిచూపులు వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన విజయ్ దేవరకొండ నటిస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అక్టోబర్ 16న ఈ సినిమా ఆడియోను సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య గ్రాండ్గా విడుదల చేసి త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.