తొలిసారి ట్వీట్‌ చేసిన మెగాస్టార్‌ చిరంజీవి

25 Mar, 2020 12:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. బుధవారం ఆయన ట్విటర్‌ ఖాతాను తెరిచారు. చిరంజీవి కొణిదెల పేరుతో అకౌంట్‌ను ప్రారంభించిన ఆయన.. అభిమానులతో మాట్లాడటం ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు ప్రజలకు శ్రీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంవత్సరాది రోజున ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
(ఈ అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి: మోదీ)

అలాగే కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)ను అరికట్టడానికి భారత ప్రభుత్వం 21 రోజులపాటు ప్రజలందరిని ఇళ్లలోనే ఉండమని ఇచ్చిన ఆదేశానికి మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ వేదికగా మద్దతు తెలిపారు. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొవడానికి  కేంద్ర తీసుకున్న నిర్ణయం  అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు.ఈ క్లిష్ట సమయంలో  మనమంతా సురక్షితంగా ఉండటానికి ప్రధాని నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ ఇచ్చే ఆదేశాలను పాటిద్దామని పిలుపునిచ్చారు. ఇంటి పట్టునే ఉందామని.. సురక్షితంగా ఉండాలని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. (‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల..)

మరిన్ని వార్తలు