చిరునవ్వు కలకాలం నిలవాలంటే..

16 Jul, 2020 10:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా విలయ తాండవంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి ఒక అద్భుతమైన వీడియోను షేర్‌ చేశారు. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్‌.. అంటూ ట్విటర్‌లో ఒక వీడియోను ట్వీట్‌ చేశారు. చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్‌ ధరించాలంటున్న చిరు ‘మెగా’ సందేశం  ఆకట్టుకుంటోంది. 

మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకపుడు.. కానీ ఇపుడు మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం అంటూ మరో వీడియోను కూడా ఆయన షేర్‌ చేశారు. రానున్న రోజుల్లో కరోనా మరింత మహమ్మారిగా మారనుందన్న డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చిరంజీవి కోరారు. దయచేసి ప్రాథమిక జాగ్రత్తలను పాటిస్తూ..ఐక్యంగా పోరాడి ఈ బాధలను తొలగించు కుందామంటూ చిరు విజ్ఞప్తి చేశారు. హీరోయిన్‌ ఈషా రెబ్బా, కార్తికేయ కనిపించిన ఈ రెండు వీడియోలు ఫ్యాన్స్‌ను విపరీతంగా  ఆకర్షిస్తున్నాయి. 

చదవండి : ఆల్ ‌ఇండియా రికార్డ్‌ సెట్‌ చేసిన బన్నీ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు