నవ్వు చెబుతోంది

27 Sep, 2018 00:18 IST|Sakshi
మేఘా ఆకాశ్‌,రజనీకాంత్‌

అభిమాన తారలతో ఫొటోలో బందీ అయిపోవాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ అందరి కలలు నిజం కావు. అయితే కథానాయిక మేఘా ఆకాశ్‌ కల నిజమైంది. ఆమెకు ఎంతో ఇష్టమైన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి ఫొటో దిగారు. ‘‘నా కల నిజమైంది. కొన్ని సార్లు నక్షత్రాలను అందుకునే అవకాశం వస్తుంది. నా ఆనందాన్ని నా నవ్వు చెబుతోంది’’ అంటూ ఇక్కడ ఉన్న ఫొటోను షేర్‌ చేశారు మేఘా ఆకాశ్‌.

ఈ సంగతి ఇలా ఉంచితే... కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న ‘పేట్టా’ సినిమాలో మేఘా ఆకాశ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోతో ఆ విషయం కన్ఫార్మ్‌ అయ్యిందని కోలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఈ సినిమాలో సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్‌ సేతుపతి, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, బాబీ సింహా తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుందట.

మరిన్ని వార్తలు