ఐ స్క్రీమ్‌

27 Apr, 2018 00:31 IST|Sakshi
మేఘా ఆకాశ్‌

‘‘ఐస్‌క్రీమ్‌ అంటే నాకు భలే ఇష్టం. కానీ టర్కీలో ఐస్‌ క్రీమ్‌కు సంబంధించిన ఒక ఎక్స్‌పీరియన్స్‌ ‘ఐ–స్క్రీమ్‌’లా మారింది అంటున్నారు’’ ‘ఛల్‌ మోహన్‌రంగ’ హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌. ఆ ఫన్నీ ఇన్సిడెంట్‌ను వివరిస్తూ  – ‘‘నా ఫస్ట్‌ తమిళ సినిమా ‘ఎన్నై నోక్కి పాయుమ్‌ తోటా’. ఇందులో ధనుష్‌ హీరో. ఆ సినిమాలో ఓ సాంగ్‌ షూట్‌ కోసం టర్కీ వెళ్లాం. ‘రోడ్‌ మీద ఏది కనిపిస్తే దానికి రియాక్ట్‌ అవుతూ అలా సరదాగా వెళ్లిపోండి. నేను షూట్‌ చేసుకుంటాను’ అని చిత్రదర్శకుడు గౌతమ్‌ మీనన్‌  చెప్పారు. అలా కొంచెం దూరం వెళ్లగానే ఐస్‌క్రీమ్‌ బండి కనిపించింది.

ధనుష్‌ రెండు గ్రీన్‌ ఫ్లేవర్‌ ఐస్‌క్రీమ్స్‌ తీసుకొని ఒకటి నాకు అందించాడు. కవర్‌ తీసి టేస్ట్‌ చేశాను. టేస్ట్‌ చాలా హారిబుల్‌ అంటే హారిబుల్‌గా ఉంది. కానీ కెమెరా రోల్‌ అవుతోంది. దాన్ని ఆస్వాదిస్తున్నట్టు నటించాలి. చేసేదేం లేక ఎంజాయ్‌ చేస్తున్నట్టు యాక్ట్‌ చేశా. ధనుష్‌ కూడా ఎంజాయ్‌ చేస్తున్నట్టే అనిపించింది. కొద్దిసేపటికి దర్శకుడు కట్‌ అని చెప్పగానే ఇద్దరం ఐస్‌క్రీమ్‌ పక్కన పడేసి ‘యాక్‌’ అని కక్కేసి, గట్టిగట్టిగా అరిచేశాం. అప్పటి నుంచి ఎప్పుడు ఐస్‌క్రీమ్‌ తింటున్నా ఈ ఫన్నీ ఇన్సిడెంటే గుర్తుకు వస్తుంది’’ అని పేర్కొన్నారు మేఘా ఆకాశ్‌.

మరిన్ని వార్తలు