వాయిస్‌ ఓవర్‌

28 Mar, 2020 00:42 IST|Sakshi

రాజకుటుంబంలో సభ్యురాలు (క్వీన్‌ ఎలిజిబెత్‌–2 మనవడు ప్రిన్స్‌ హ్యారీని వివాహం చేసుకున్నారు) కావడంతో సినిమాలకు దూరమయ్యారు హాలీవుడ్‌ నటి మేఘన్‌ మార్కెల్‌. అయితే ఇటీవలే రాజకుటుంబం నుంచి తప్పుకుని స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నట్టు ప్రకటించారు. వెంటనే డిస్నీ సంస్థ వాళ్లు మేఘన్‌ మార్కెల్‌తో ఓ సినిమాకి ఒప్పందం కుదుర్చున్నారు. ఏనుగుల మీద డిస్నీ సంస్థ ఓ సినిమా తెరకెక్కించింది. ఈ సినిమాలో వచ్చే వాయిస్‌ ఓవర్‌ను మేఘన్‌ మార్కెల్‌ చెప్పనున్నారు. ఆమె పారితోషికం ఏనుగుల పరిరక్షణకి విరాళంగా వెళ్తుందట.

మరిన్ని వార్తలు