ఫస్ట్‌ టైమ్‌ జెన్యూన్‌గా తీసిన సినిమా మెహబూబా

24 Apr, 2018 00:54 IST|Sakshi
చార్మి, నేహా, ఆకాశ్, పూరి జగన్నాథ్, భాస్కరభట్ల

పూరి జగన్నాథ్‌

 ‘‘నేను రోజూ పొద్దున నిద్ర లేవగానే చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్స్‌ చెప్పి, ‘ఒక వేషం ఇవ్వండి’ అని అడిగేవాడు ఆకాశ్‌. వాడి టార్చర్‌ తట్టుకోలేక ‘చిరుత’లో ఒక వేషం ఇచ్చాను. ఓసారి ‘నువ్వు హీరో అవ్వడానికి ఇంకో పదేళ్లు పడుతుంది. ఆ టైమ్‌కు నాకు కెపాసిటీ ఉంటుందో, డబ్బులు ఉంటాయో లేదో తెలీదు. నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో’ అని చెప్పా.  అప్పటినుంచి ఇంటికి ఏ డైరెక్టర్‌ వచ్చినా చాన్స్‌ కోసం కాళ్లు పట్టేసుకునేవాడు. టైమ్‌ బావుండి నేనే సినిమా తీశా’’ అని అన్నారు పూరి జగన్నాథ్‌.

ఆకాశ్‌ పూరి, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘మెహబూబా’ మే 11న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలోని రెండో పాటను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ– ‘‘నేను 35 సినిమాలు చేసినా ఫస్ట్‌ టైమ్‌ జెన్యూన్‌గా ఒక సినిమా చేశాను అనే ఫీల్‌ వచ్చింది.  హీరో ఆకాశ్‌ గురించి చెప్పాలి. వీడు నాకు చాలా బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండేవాడు (నవ్వుతూ). ‘దిల్‌’ రాజుగారు సినిమా చూసి రెండు విషయాలు చెప్పారు.

ఒకటి.. నువ్వు మనసు పెట్టి చేస్తే ఇలా ఉంటుంది. రెండు.. నీ కెరీర్‌లో బెస్ట్‌ ఫిల్మ్‌ అన్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సందీప్‌ చౌతాతో నాకిది మూడో సినిమా. అమేజింగ్‌ సాంగ్స్‌ ఇచ్చారు. తమ్ముడు భాస్కరభట్ల ‘మెహబూబా’ మీద పగబట్టి పాటలు రాశాడు. అందరూ మనసుపెట్టి సినిమా చేశారు. చార్మి ప్రొడక్షన్‌ బాగా చేసింది. మగాళ్ల కంటే ఎక్కువగా పనిచేస్తుంది చార్మి. అందుకే నాకు ఇష్టం. నేహా చాలా బాగా చేసింది. నాకు యాభై ఏళ్లు దాటాయి. నెక్ట్స్‌ టెన్‌ ఇయర్స్‌లో ఆకాశ్‌ కంటే ఎక్కువ సినిమాలు, మంచి సినిమాలు నేను చేస్తాను.

ఇది నా ఛాలెంజ్‌’’ అన్నారు. ‘‘పూరీగారితో నాకిది 25వ సినిమా. ఇంతవరకూ రాసిన సినిమాలు ఒక ఎల్తైతే. ఈ సినిమా మరో ఎత్తు. చాలా ఇష్టంతో రాశాను. ఈ సినిమా కోసం చాలా పాటలు వదిలేశాను. అయినా రిగ్రెట్‌ లేదు. గొప్ప సినిమా కోసం ఎన్ని రోజులు, ఎన్ని గంటలు వెచ్చించినా నష్టం లేదని నా ఉద్దేశం’’ అన్నారు భాస్కరభట్ల. ‘‘సందీప్‌ గారికి థ్యాంక్స్‌ చెప్పాలి. ఈ సినిమాకు మ్యూజిక్‌ బ్యాక్‌బోన్‌. షూటింగ్‌ స్టార్ట్‌ చేయడమే ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో స్టార్ట్‌ చేశాం. మా నాన్న ఇంత మంచి కథను ఏ స్టార్‌ హీరోతో అయినా తీయొచ్చు కానీ నాతో చేశారు.

ఇది డెఫినెట్‌గా మా నాన్నకు కమ్‌బ్యాక్‌ ఫిల్మ్‌ అవుతుంది. ఈ కమ్‌బ్యాక్‌ ఏ స్టార్‌తో ఇవ్వట్లేదు. ఏమాత్రం ఎక్స్‌పీరియన్స్‌ లేని, ఏమాత్రం ఫ్యాన్‌ బేస్‌ లేని ఒక 22 ఏళ్ల కుర్రాడితో ఆయన కమ్‌బ్యాక్‌ ఇస్తున్నారు. ‘ఆకాశ్‌ చాలా కాన్ఫిడెన్స్‌తో మాట్లాడేస్తున్నాడు’ అని అంటున్నారు. అవును కాన్ఫిడెన్సే. మా నాన్న మీద ఉన్న కాన్ఫిడెన్స్‌’’ అన్నారు ఆకాశ్‌. ‘‘ట్రైలర్‌కు మంచి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. మేం చాలా కష్టమైన క్లైమెటిక్‌  కండీషన్‌లో షూట్‌ చేశాం. ఫాదర్, సన్‌ కాంబినేషన్‌ గురించి అందరూ అడుగుతున్నారు. సెట్లో పూరీగారు ఎంత కూల్‌గా ఉంటారో అందరికీ తెలుసు. అంతకన్నా ఎక్కువ కూల్‌ ఆకాశ్‌’’ అన్నారు చార్మి.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా