ఫన్‌లోకి ఎంట్రీ

8 Jul, 2018 00:30 IST|Sakshi
మెహరీన్‌

ఫన్‌ను డబుల్‌ నుంచి ట్రిపుల్‌ చేయడానికి ఫన్‌ రైడ్‌లో జాయిన్‌ అయ్యారు కథానాయిక మెహరీన్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ ముఖ్య తారలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఎఫ్‌ 2’. ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ అనేది ఉపశీర్షిక. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌లోకి రీసెంట్‌గా వరుణ్‌ తేజ్‌ జాయిన్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సెట్‌లోకి మెహరీన్‌ ఎంట్రీ ఇచ్చారు. వరుణ్‌తేజ్, మెహరీన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. హాస్యనటుడు ప్రియదర్శి కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా నటించనున్నారన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు