ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

30 Jul, 2019 08:26 IST|Sakshi

చెన్నై :  ఆ సినిమాలో అంతా కట్టే అంటోంది నటి మెహరీన్‌. మోడలింగ్‌ రంగం నుంచి వెండితెరకు దిగుమతి అయిన పంజాబీ బ్యూటీ ఈ అమ్మడు 2016లో కృష్ణగాడి వీర ప్రేమగాథ అనే తెలుగు చిత్రం ద్వారా కథానా యకిగా పరిచయం అయ్యింది. 2017లో నెంజిల్‌ తుణివిరుందాల్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బాలీవుడ్‌కు వెళ్లింది. నాలుగు భాషల్లో నటిస్తున్నా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ కోసం తంటాలు పడుతూనే ఉందనే చెప్పాలి. ఈ అమ్మడికి తెలుగులో ఇటీవల ఎఫ్‌–2 చిత్రంతో మంచి సక్సెస్‌ వరించింది. అయినా స్టార్స్‌తో నటించే అవకాశాలు అంతంత మాత్రమే. ముఖ్యంగా తమిళంలో సుశీంద్రన్‌ దర్శకత్వంలో విష్ణువిశాల్‌కు జంటగా నటించిన నెంజిల్‌ తుణివిరుందాల్‌ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీని గురించి ఇటీవల ఒక భేటీలో ఈ బ్యూటీ మాట్లాడుతూ.. ఆ చిత్రంలో తాను నటించిన సన్నివేశాలన్నీ ఎడిటింగ్‌ రూంకే పరిమితం అయ్యాయని చెప్పింది. ఒక నటికి తాను నటించిన సన్నివేశాలను ఎడిటింగ్‌లో తీసేస్తే ఎంత బాధగా ఉంటుందో, మాటల్లో చెప్పలేనంది.

అయితే చిత్ర నిడివి అధికం కావడం కారణంగా తాను నటించిన సన్నివేశాలను కట్‌ చేసినట్లు చిత్ర దర్శకుడు సుశీంద్రన్‌ తనకు ముందే చెప్పారని పేర్కొంది. కొన్ని సమయాల్లో మనల్ని దాటి కొన్ని విషయాలు జరిగిపోతాయని, ఇదీ అలాంటిదేననీ తనను తాను సర్ది చెప్పుకున్నానని అంది. ముచ్చటగా మూడోసారి కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. ఈ సారి ధనుష్‌తో రొమాన్స్‌ చేయనుంది. దురై సెంధిల్‌కుమార్‌ దర్శత్వంలో సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయనకు జంటగా స్నేహ, మెహరీన్‌ నటిస్తున్నారు. దీనికి పటాస్‌ అనే టైటిల్‌ను ఇటీవలే వెల్లడించారు. ఈ చిత్రం గురించి మెహ్రిన్‌ మాట్లాడుతూ.. ధనుష్‌ ఎలాంటి సన్నివేశాన్నైనా సింగిల్‌ టేక్‌లో నటించేస్తారని చెప్పింది. ధనుష్‌ సంభాషణల ఉచ్ఛరింపు గురించి తనకు నేర్పించేవారని చెప్పింది. తమిళ భాషను ఇప్పుడే నేర్చుకుంటున్నానని మెహరీన్‌ తెలిపింది. మరి ఈ చిత్రం అయినా ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చిపెడుతాందా? లేదో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాపులారిటీ ఉన్నవారికే ‘బిగ్‌బాస్‌’లో చోటు

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

వాలి స్ఫూర్తితో...

కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను

బంగారు గనుల్లోకి...

తిరున్నాళ్ల సందడి!

పిక్చర్‌ పర్ఫెక్ట్‌

కరెక్ట్‌ టైమ్‌లో చెప్పిన కథ ఇది

చికుబుకు రైలే...

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘గీతాంజలి’లో ఆ సీన్‌ తీసేస్తారనుకున్నా : నాగ్‌

‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

ఇషాన్‌తో జాన్వీకపూర్‌ డేటింగ్‌..!

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు

అదిరిపోయిన అధీరా లుక్‌..!

సూపర్‌స్టార్‌.. రియల్‌ బిజినెస్‌మేన్‌

అతనిలో నేను ఆమెలా ఉంటూ..

‘బిగ్‌ బాస్‌ షోలో ఆయన చేసింది బాగోలేదు!’

‘ఇది ఏమైనా మీ ఇంటి హాలా, పెరడా’

కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా ‘తూనీగ’

‘బిగ్‌బాస్‌’పై హేమ సంచలన వ్యాఖ్యలు

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

వాలి స్ఫూర్తితో...