ఆ హీరోయిన్‌కు అదృష్టం పట్టుకుంది..

19 Oct, 2017 16:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హీరోయిన్‌ మెహ్రీన్‌ కౌర్‌కు అదృష్టం పట్టుకుంది. ఆమె నటించిన సినిమాలు వరుసగా హ్యీట్రిక్‌ విజయం సాధించాయి. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’  సినిమాతో టాలీవుడ్లో ఆరంగ్రేటం చేసింది. ఆ సినిమా విజయం సాధించినప్పటికీ అవకాశాలు రాలేదు. దాదాపుగా ఒక ఏడాది పాటు అవకాశం ఎదురు చూసింది మెహ్రీన్‌. నిధానమే ప్రధానం అన్నది మెహ్రీన్‌కు సెట్‌ అవుతుందేమో. ఈ ఏడాది ఆమె వరుసగా రెండు సినిమాలు చేసింది.

కొద్ది రోజుల క్రితం శర్వానంద్‌ నటించిన ‘మహానుభావుడు’ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మెహ్రీన్‌ చాలా బాగా నటించింది. అంతేకాక ఆమెకు మంచిపేరును తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఆనందంలో ఉన్న మెహ్రీన్‌కు తాజాగా విడుదలైన రవితేజ ‘రాజా ది గ్రేట్‌’  కూడా విజయాన్ని అందుకుంది. ఈ విధంగా మెహ్రీన్‌ టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది.

ఈ రెండు సినిమాల విజయంతో ఆమెకు ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. సాయి ధరమ్‌ తేజ్‌తో మెహ్రీన్‌ జవాన్‌ సినిమాలో  జత కట్టిన విజయం తెలిసందే. ఈ సినిమాకు బీబీఎస్‌ రవి దర్శకత్వంలో వహిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా