మరపురాని మంచిమనిషి

17 Feb, 2016 23:44 IST|Sakshi
మరపురాని మంచిమనిషి

ఎవరూ ఊరకే గొప్పవాళ్ళైపోరు. ఎంచుకున్న రంగంలో ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించాడంటే, వెనక నిరంతర శ్రమ, కృషి, అంకితభావం తప్పనిసరి. ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోయే సినీ రంగంలో ఆ పని చేసి చూపెట్టిన నిర్మాత, స్టూడియో అధినేత డి. రామానాయుడు. సినీ రంగంలో కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నా, సంపాదించిన ప్రతి పైసా మళ్ళీ అక్కడే పెట్టుబడి పెట్టి, తనను పైకి తెచ్చిన రంగాన్నే పైపైకి తెచ్చినవాళ్ళు చాలా కొద్దిమందే కనిపిస్తారు. రామానాయుడు ఇవాళ్టికీ గుర్తున్నది అందుకే. సురేష్ ప్రొడక్షన్‌‌సపై ఆయన నిర్మిం చిన ‘రాముడు-భీము  ప్రేమ్ నగర్’ లాంటి ఆణిముత్యాలు, హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కట్టిన స్టూడి యోలు, పంపిణీ, ప్రదర్శన రంగాల్లో చేసిన కృషి, ఎంపీగా చేసిన మంచి పనులు చరిత్ర మర్చిపోలేనివి. నమ్ముకున్న వాళ్ళకీ, కష్టాల్లో ఉన్నవాళ్ళకీ సాయంగా నిలబడిన వ్యక్తిగా ఈ శతాధిక చిత్ర నిర్మాత గురించి కథలుగా ఇప్పటికీ చెబుతారు. ఆయన కీర్తిశేషులై, ఇవాళ్టికి సరిగ్గా ఏడాది. ఆయనకు నివాళి.