ఎనిమిది పదుల వయసులో కూడా.. ఈ బామ్మ!

4 Apr, 2020 16:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓ వృద్ధురాలు తన ఒంటి కాలిపై గెంతడమే కాకుండా చీరలోనూ పుష్‌-అప్స్‌, లాంగ్‌రన్‌లు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. 81 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నేస్‌ ప్రియులకు గట్టి పోటినిస్తూ సవాలు విసురుతున్న ఈ వృద్దురాలు ఎవరో కాదు.. మన టాప్‌ ఇండియన్‌ మోడల్‌ మిలింద్‌ సోమన్ తల్లి ఉష సోమన్‌. మిలింద్‌ భార్య అంకితా కొన్వర్‌తో కలిసి ఆమె ఒంటి కాలితో బాక్స్‌ జంప్స్‌ చేయడమే కాకుండా కొడుకుతో సమానంగా పుష్‌-అప్స్‌, వర్కఅవుట్స్‌ చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంకిత తన అత్తతో కలిసి బాక్స్‌ జంప్స్‌ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం షేర్‌ చేస్తూ.. ‘మీరు చాలా మందికి ఆదర్శం. ఒకవేళ నేను 80 ఏళ్ల వరకూ జీవించి ఉంటే మీలా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్న’అంటూ రాసుకొచ్చారు. (‘నాన్న చనిపోతే పెద్దగా బాధ పడలేదు’)

అంతేకాదు ఉష సోమన్‌ తన కొడుకు మిలింద్‌తో కలిసి చీరలో పుష్‌-అప్‌లు చేస్తున్న వీడియో కూడా గతంలో వైరల్‌ అయ్యింది. ఇటీవల ఉష, తన కొడుకు మలింద్‌కు పోటీగా ఒకేసారి 16 పుష్‌-అప్‌లు చేసిన వీడియోను ఉమెన్స్‌ డే సందర్భంగా షేర్‌ చేశాడు. అలాగే 2016లో మహరాష్ట్రలోని నిర్వహించిన ఓ మరథాన్‌లో మలింద్‌తో పాటు ఆయన తల్లి ఉష కూడా పాల్గొన్న వీడియో మదర్స్‌ డే సందర్భంగా పంచుకున్నాడు. ఇలా వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యవంతమైన ఫిట్‌నెస్‌తో యువతతో పాటు వృద్ధులకు కూడా సవాలుగా నిలిచిన తన తల్లి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను తరచూ మలింద్‌ సోషల్‌ మీడియాలో పంచుకంటుంటాడు. కాగా యంగ్‌ మోడలైనా అంకితా కొన్వర్‌, తన తల్లి వయస్సున్న మిలింద్‌ను 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఫిట్‌నెస్‌ ప్రియుడైన మిలింద్‌ వివిధ మారథాన్‌లో చురుగ్గా పాల్గొంటు ఉంటాడు.

మరిన్ని వార్తలు