మినీ థియేటర్స్‌ కోసం

29 Jul, 2018 01:14 IST|Sakshi
పి. రామ్మోహనరావు

రానున్న రోజుల్లో బస్టాండ్స్‌లో మినీ థియేటర్స్‌ ప్రత్యక్షం కానున్నాయి. దాని కోసం కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, అధ్యక్షుడు పి. రామ్మోహనరావులు పలువురు అధికారులతో చర్చించి, తెలంగాణా చలన చిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టీసీ బస్టాండ్స్‌లో మినీ థియేటర్స్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

రాష్ట్రంలోని పలు బస్టాండ్స్‌లో, వాటికి సంబంధించిన ఖాళీ స్థలాల్లో 80 నుంచి 100 మినీ థియేటర్ల ఏర్పాటుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణతోనూ రామ్మోహన్‌ రావు చర్చించారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సిందిగా టెండర్లను ఆహ్వానించినా సరైన స్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, మినీ థియేటర్ల ఏర్పాటుకు తగిన అనుమతులు తీసుకోవాలనుకుంటున్నాం’’ అని రామ్మోహనరావు అన్నారు.

మరిన్ని వార్తలు