సూపర్ హారర్!

31 Jan, 2016 23:24 IST|Sakshi
సూపర్ హారర్!

ఈ ఆరునెలల్లో తమిళ పరిశ్రమలో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ‘తని ఒరువన్’ ఒకటి. ‘జయం’ రవి హీరోగా రూపొందిన ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో రామ్‌చరణ్ నటించనున్న విషయం తెలిసిందే. ‘తని ఒరువన్’ భారీ వసూళ్లు కురిపించడంతో ‘జయం’ రవి నటిస్తున్న తాజా చిత్రం ‘మిరుథన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జయం’ రవి, లక్ష్మీ మీనన్ జంటగా శక్తి సౌందర్యరాజన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అదే పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. ఇది సూపర్ న్యాచురల్ హారర్ మూవీ అని తెలుగులోకి విడుదల చేయనున్న లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ  నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్,  టైటిల్ లోగోలను త్వరలోనే ఆవిష్కరించనున్నామని కూడా చెప్పారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి