రెండు కుటుంబాల మధ్య మిస్‌ మ్యాచ్‌

12 Jul, 2019 02:28 IST|Sakshi
ఉదయ్‌ శంకర్, వెంకటేష్‌

‘‘మిస్‌ మ్యాచ్‌’ టీజర్‌ ఆసక్తిగా ఉంది. కుటుంబ ప్రేక్షకులందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. ఉదయ్‌ శంకర్‌కు నటుడిగా మంచి భవిష్యత్‌ ఉంది. కథ అందించిన భూపతిరాజాగారికి, డైరెక్టర్, నిర్మాతలకు బెస్ట్‌ ఆఫ్‌ లక్‌’’ అని హీరో వెంకటేష్‌ అన్నారు. ఉదయ్‌ శంకర్, ఐశ్వర్యా రాజేష్‌ జంటగా  తమిళ చిత్రం ‘సలీం’ ఫేమ్‌ ఎన్‌.వి. నిర్మల్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. అధిరోహ్‌ క్రియేటివ్‌ సైన్స్‌ ఎల్‌.ఎల్‌.పి పతాకంపై జి.శ్రీరామ్‌ రాజు, భరత్‌ రామ్‌ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను వెంకటేష్‌ విడుదల చేశారు.

ఉదయ్‌ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘ఆటకదరా శివ’కు వెంకటేష్‌గారు చాలా సహకారం అందించారు. ఇప్పుడు ‘మిస్‌ మ్యాచ్‌’ టీజర్‌ ఆయన చేతుల మీదగా విడుదలవడం సంతోషంగా ఉంది. భూపతిరాజాగారు ఇచ్చిన కథను దర్శకుడు బాగా తీశారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నా’’ అన్నారు ఎన్‌.వి.నిర్మల్‌. ‘‘ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ మా సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది’’ అన్నారు శ్రీరామ్‌. ‘‘రెండు కుటుంబాల మధ్య జరిగే కథే ‘మిస్‌ మ్యాచ్‌’’ అన్నారు రచయిత భూపతిరాజా. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్‌ ఇలియాస్, కెమెరా: గణేష్‌ చంద్ర.

మరిన్ని వార్తలు