బెయిల్‌పై వచ్చాడు.. పెళ్లి చేసుకున్నాడు

10 Jul, 2018 16:29 IST|Sakshi
వివాహంతో ఒక్కటైన మహాక్షయ్‌ - మదాలస శర్మ

అర్థాంతరంగా పీటల మీదే ఆగిపోయిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌ వివాహం మంగళవారం ఊటిలో జరిగింది. ఓ యువతిని రేప్ చేసి, మోసం చేసిన కేసులో కోర్టు ఆదేశాలతో మహాక్షయ్‌ను విచారణ చేయడం కోసం పోలీసులు గత శనివారం ఊటీలోని వివాహ వేదిక వద్దకు చేరుకోవడంతో వధువు కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే యువతిని అత్యాచారం చేసిన కేసులో కోర్టు మహాక్షయ్‌కు బెయిల్‌ మంజూరు చేయడంతో తన ప్రియురాలు, దక్షిణాది నటి అయిన మదాలస శర్మను ఈ నెల 7న రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నట్లు సమాచారం. అనంతరం మంగళవారం(ఈ రోజు) తమిళనాడు ఊటిలోని తన విలాసవంతమైన హోటల్‌లో సాంప్రదాయబద్దంగా మరోసారి వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే మహాక్షయ్‌, అతని తల్లి యోగిత మీద నమోదైన కేసును విచారించిన ఢిల్లీలోని ఓ కోర్టు నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ కేసులో చట్టప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని యోగిత, మహాక్షయ్‌లు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కానీ వీరి విజ్ఞప్తిని తిరస్కరించిన హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు