వర్క్‌ హార్డ్‌... సక్సెస్‌ విల్‌ ఫాలో

19 Mar, 2018 00:58 IST|Sakshi
కల్యాణ్‌ రామ్

‘‘కొత్త దర్శకులతోనే సినిమాలు చేయాలని అనుకోలేదు. స్క్రిప్ట్‌లో జెన్యూనిటీ కనిపిస్తే న్యూ  డైరెక్టరా? ఎస్టాబ్లిష్డ్‌ డైరెక్టరా? అని ఆలోచించను. సినిమా చేసేస్తాను’’ అన్నారు కల్యాణ్‌ రామ్‌. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్, కాజల్‌ అగర్వాల్‌ జంటగా  రూపొందిన చిత్రం ‘ఎం.ఎల్‌.ఎ’. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌.ఎల్‌.పి, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌ పై భరత్‌ చౌదరి, కిరణ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం మార్చి 23న విడుదల కానుంది ఈ సందర్భంగా కల్యాణ్‌ రామ్‌ చెప్పిన విశేషాలు.

► పోలింగ్‌ (సినిమా విడుదలను ఉద్దేశించి) దగ్గర పడింది.ఈ పోలింగ్‌లో విశేషమేంటంటే రిజల్ట్‌ కూడా అదే రోజు వచ్చేస్తుంది. సినిమా టైటిల్‌లోనే హీరో క్యారెక్టరైజేషన్‌ ఉంటుంది.

► సినిమా పొలిటికల్‌ డ్రామానే బట్‌ పూర్తిగా పాలిటిక్స్‌ గురించి మాట్లాడం. లవ్‌ స్టోరీతో బిగిన్‌ అయి సెకండ్‌ హాఫ్‌ పాలిటిక్స్‌ వైపు మళ్లుతుంది. కార్పొరేట్‌ ఎడ్యుకేషన్‌ గురించి కూడా డిస్కస్‌ చేశాం.

► ఉపేంద్ర మాధవ్‌ రైటర్‌ అవ్వటం వల్ల సినిమాలో డైలాగ్స్‌ చాలా బాగా వచ్చాయి. సినిమాలో నా డైలాగ్‌ డిక్షన్‌ చాలా కొత్తగా ఉంటుంది. ఈ విషయంలో ఉపేంద్ర చాలా పర్టికులర్‌గా ఉన్నాడు.

► ‘ఏంటి ఇంత చెత్త సినిమా చేశాడు’ అనే రివ్యూ అయితే ఇప్పటివరకు రాలేదు. నా గురించి ఏమైనా బ్యాడ్‌ రివ్యూలు వస్తే వాటిని అనలైజ్‌ చేసుకొని వర్కౌట్‌ చేస్తాను. మై ఫ్యామిలీ ఈజ్‌ మై బిగ్గెస్ట్‌ క్రిటిక్‌. ‘వర్క్‌ హార్డ్‌.. సక్సెస్‌ విల్‌ ఫాలో’ అనే ఫిలాసఫీని నమ్ముతాను. సక్సెస్‌ కోసం పరిగెత్తినా కొన్నిసార్లు రాకపోవచ్చు. మనం ఏం చేసినా మనకు సంతృప్తిగా అనిపించాలి.

► సాయిధరమ్‌ తేజ్, నేను ఓ మల్టీస్టారర్‌ చేద్దాం అనుకున్నాం. బట్‌ స్క్రిప్ట్‌ కుదరకఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. స్క్రిప్ట్‌ నచ్చితే ఎవరితో అయినా మల్టీస్టారర్‌ సినిమాలు చేస్తాను. ఈ జులైలో ఒక మల్టీస్టారర్‌ సినిమా అనౌన్స్‌ చేయనున్నాం. 

► ప్రొడ్యూసర్‌గా నేనెప్పుడూ హ్యాపీనే. ‘ఈ సినిమా ఎందుకు చేశాను’ అని ప్రొడ్యూసర్‌గా ఎప్పూడు అనుకోలేదు. ఏంటి ఇంత తలనొప్పి సినిమా చేశాడు? అని ఆడియన్స్‌ కూడా అనుకోకూడదు. బయట ప్రొడక్షన్స్‌తో చేసేటప్పుడు అనుకున్న బడ్జెట్‌లోనే పూర్తి చేయాలని చూస్తాను.

► తారక్, నేను ఎక్కువగా సినిమాల గురించే మాట్లాడుకుంటాం.‘ఎం.ఎల్‌.ఎ’ ట్రైలర్‌ చూసి చాలా డిఫరెంట్‌గా ఉన్నావు, చాలా కాన్ఫిడెంట్‌గా కూడా కనిపిస్తున్నావు’ అన్నాడు. మా డిస్కషన్‌లో పాలిటిక్స్‌ రాదు. ఎక్కవగా కార్లు, గాడ్జెట్స్‌ గురించి డిస్కస్‌ చేస్తాం.

► ఈ సినిమాలో ఎం.ఎల్‌.ఏ పలికిన సంభాషణలు కానీ టైటిల్‌ కానీ నా ఫ్యూచర్‌ పాలిటిక్స్‌ గురించి ఏమీ ఇండికేషన్‌ ఇస్తున్నట్లు కాదు. ఇది సినిమాలో నా క్యారెక్టర్‌ మాత్రమే. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు.

► నెక్ట్స్‌ ‘నా నువ్వే’ సినిమా చేస్తున్నాను. ఫుల్‌ లెంగ్త్‌ లవ్‌ స్టోరీ ఫస్ట్‌ టైమ్‌ చేస్తున్నాను.

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా ‘ఉయ్యాల జంపాల, మజ్ను’ చిత్రాల ఫేమ్‌ విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై ‘జెమినీ’ కిరణ్‌ నిర్మించనున్న సినిమాను  ఆదివారం ఉగాది రోజున అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘‘ చక్కని కుటంబ నేపథ్యం ఉన్న చిత్రమిది. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు నిర్మాత.

మరిన్ని వార్తలు