ఈ ఛాలెంజ్‌ కూడా కరోనాలానే ఉంది

23 Apr, 2020 05:37 IST|Sakshi
కొరటాల శివ, సుకుమార్‌, కీరవాణి

బీ ది రియల్‌ మేన్‌ చాలెంజ్‌

‘‘చూస్తుంటే ‘బీ ది రియల్‌ మేన్‌ ఛాలెంజ్‌’ కూడా కరోనా లాగే ఒకరి తర్వాత  ఒకరికి  వ్యాప్తి చెందుతోంది’’  అంటున్నారు సంగీత దర్శకులు కీరవాణి. ఇంటి పనులను మగవాళ్లు కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు సందీప్‌ వంగ  ‘బీ ది రియల్‌ మేన్‌’  ఛాలెంజ్‌ ను స్టార్ట్‌ చేశారు.  రాజమౌళి ఛాలెంజ్‌ విసరడంతో ఈ ఛాలెంజ్‌ లో పాల్గొన్నారు కీరవాణి. బట్టలు ఆరేస్తూ, మొక్కలకు నీళ్లు పోస్తూ, డైనింగ్‌ టేబుల్‌ శుభ్రం చేస్తూ ఉన్న వీడియోను పోస్ట్‌ చేసి, ‘‘కరోనా లాగా ఈ ఛాలెంజ్‌ సందీప్‌ వంగ నుంచి రాజమౌళికి, అతని దగ్గర నుంచి నా దాకా వచ్చింది. నా వంతు పని నేను చేస్తున్నాను. ఈ ఛాలెంజ్‌ కు దర్శకుడు క్రిష్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ని నామినేట్‌ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు కీరవాణి.

అలాగే మరో ఇద్దరు దర్శకులు కూడా ఈ ఛాలెంజ్‌ లో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ ఛాలెంజ్‌ విసరడంతో కొరటాల శివ పాత్రలు శుభ్రం చేస్తూ, ఫ్లోర్‌ క్లీన్‌ చేస్తూ ఇంటి పనుల్లో సహాయం చేస్తున్న వీడియోను ట్వీటర్‌ లో షేర్‌ చేసి, ‘‘మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా రాను రాను సరదా అయింది. ఇప్పుడు అలవాటయింది’’ అని పేర్కొన్నారు. ఈ ఛాలెంజ్‌ కి విజయ్‌ దేవరకొండను నామినేట్‌ చేశారాయన. రాజమౌళి  విసిరిన ఛాలెంజ్‌ ను స్వీకరించిన సుకుమార్‌.. ఇంటి పనులు చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. ఇల్లు తుడుస్తూ, గిన్నెలు శుభ్రం చేస్తున్న వీడియోను షేర్‌ చేసి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత ‘దిల్‌’రాజులను నామినేట్‌ చేశారు సుకుమార్‌.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా