ఛాలెంజ్‌ పూర్తిచేసిన సుకుమార్‌, కీర‌వాణి

22 Apr, 2020 15:18 IST|Sakshi

లాక్‌డౌన్ వేళ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో  'బి ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ను ప‌లువురు సెల‌బ్ర‌టీలు స్వీక‌రించి త‌మ భార్య‌ల‌కు వంట‌ప‌నిలో, ఇంటిప‌నిలో స‌హాయం చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి విసిరిన ఈ ఛాలెంజ్‌ను డైరెక్ట‌ర్ సుకుమార్‌, సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి పూర్తి చేశారు.  ఇల్లు తుడిచి, గిన్నెలు కడిగి ఇంటి పనిలో తన భార్యకు సహాయం చేశారు లెక్క‌ల మాస్టార్ , ద‌ర్శ‌కుడు సుకుమార్‌. చివ‌ర్లో ఆయ‌న భార్య బావుందంటూ ఖితాబిచ్చారు. ఆ వీడియోను సుకుమార్  తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.  ఇక తన ఛాలెంజ్‌ను స్వీకరించాలంటూ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, శివ కొరటాల, నిర్మాత దిల్‌ రాజు పేర్లను నామినేట్ చేశారు సుకుమార్

సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి.. ఇంటిని శుభ్రం చేసి, మొక్క‌ల‌కు నీళ్లు ప‌ట్టి, బ‌ట్ట‌లు ఉత‌క‌డం లాంటి ప‌నులు చేసి వీడియోను పోస్ట్ చేశారు. దీనికి అప్పుడ‌ప్పుడూ అనే సాంగ్‌ను జ‌త చేశారు.  క‌రోనా లానే ఈ ఛాలెంజ్ కూడా అంటువ్యాధి లాంటిద‌ని వ్యాఖ్యానించిన కీర‌వాణి..  దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు తమన్‌లను నామినేట్ చేశారు. ఇక ఈ  ఛాలెంజ్‌ను త్వ‌ర‌లోనే పూర్తిచేస్తాన‌ని త‌మ‌న్ తెలిపారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు