తండ్రి పాత్రపై హింటిచ్చిన విష్ణు

25 Dec, 2017 15:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్ హీరో, యాక్షన్‌ కింగ్‌ మోహన్ బాబు చాలా కాలం తరువాత లీడ్ రోల్‌ గా తెరకెక్కుతున్న గాయత్రి సినిమాపై మోహన్‌బాబు కుమారుడు , హీరో,  ప్రొడ్యూసర్‌ మంచు విష్ణు  మాట్లాడారు. ముఖ్యంగా ఈ మూవీలో మోహన్‌ బాబు పాత్రపై హింట్‌ ఇచ్చారు.  ఇప్పటికే  ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగా, విలన్‌గా ద‍్విపాత్రాభినయం చేస్తున్నారనేది  టాలీవుడ్‌ టాక్‌. ఈ వార్తలకు బలాన్నిస్తూ  విష్ణు  మోహన్‌ బాబు విలన్‌, హీరోగా రెండు విభిన్నమైన  పాత్రల్లో నటిస్తున్నారని స్పష్టం చేశారు.

ముఖ్యంగా  గాయత్రి సినిమాలో మోహన్‌బాబు భయంకరమైన విలన్‌ పాత్ర పోషిస్తున్నారని విష్ణు వెల్లడించారు. అంతేకాదు  డైలాగ్‌ డెలివరీలో ఆయన శైలి, ప్రత్యేకత మరోసారి వెల్లడికానుందని తెలిపారు. మరోవైపు తనకు  ప్రొడ్యూసర్‌గా, నటుడిగా ఈ సినిమా  యాసిడ్‌ టెస్ట్‌ లాంటిదని  వ్యాఖ్యానించారు.  ఇప్పటివరకు తాను నటించిన పాత్రలతో పోలిస్తే ఇది చాలా విభిన్నంగా ఉంటుందన్నారు. అలాగే తన తండ్రి సెట్స్‌లో ఉండడంతో ప్రతీదీ  సక్రమంగా జరిగిందని  చెప్పారు.

కాగా మదన్‌ దర్శకత‍్వంలో వస్తున్న ఈ మూవీలో  శ్రియ  శరణ్‌, నిఖిల విమన్‌,  అనసూయ భరద్వాజ్  ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.  ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర  యూనిట్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు