మోహన్‌బాబు న్యూలుక్‌.. చిరు కోసమే..!

8 Feb, 2020 17:28 IST|Sakshi

టాలీవుడ్‌ కథానాయకుడు, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవీ సినిమా కోసమే ఆయన న్యూలుక్‌తో ఫోటోషూట్‌లో పాల్గొన్నట్లు సమాచారం.

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది. చిరు సినిమాలో విలన్‌ పాత్ర కోసం మోహన్‌బాబును కొరటాల శివ కలిశాడని, దానికి ఆయన అంగీకరించారని టాలీవుడ్‌ టాక్‌. ఈ నేపథ్యంలో తాజాగా వైరల్‌ అయిన మోహన్‌బాబు న్యూలుక్‌ ఫోటోలు పుకార్లకు ఆజ్యం పోస్తున్నాయి. చిరు సినిమా కోసమే ఆయన కొత్త లుక్‌లో ఫోటోషూట్‌ చేశారని వార్తలు వస్తున్నాయి. నెటిజన్లు సైతం ఆయన లుక్‌ను ప్రశంసిస్తున్నారు.

కాగా, గతంలో వీరింద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బిల్లా రంగా’,‘పట్నం వచ్చిన ప్రతివతలు’మంచి విజయాన్ని సాధించాయి. చిరంజీవీ హీరోగా చేసిన పలు చిత్రాలలో మోహన్‌బాబు విలన్‌గా నటించారు. ప్రస్తుతం మోహన్‌బాబు సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ఆకాశం నీ హద్దురాలో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా