చిరు సినిమాలో విలన్‌గా స్టార్‌ హీరో.!

4 Feb, 2020 10:11 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కలెక్షన్‌ కింగ్ మోహన్‌బాబు విలన్‌గా నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక ఈ చిత్రంపై రోజుకో వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విలన్‌ పాత్ర కోసం మోహన్‌బాబును కొరటాల శివ సంప్రదించారని టాక్‌.  మోహన్ బాబుకు కొరటాల స్క్రిప్ట్‌ను నెరేట్ చేశారట. అయితే, మోహన్ బాబు ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని సమాచారం. ఒకవేళ మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే  విలన్ పాత్ర ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ అవుతుంది.

కాగా, గతంలో వీరింద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ బిల్లా రంగా’, ‘పట్నం వచ్చిన ప్రతివతలు’  మంచి విజయాన్ని సాధించాయి. చిరంజీవీ హీరోగా చేసిన పలు చిత్రాలలో మోహన్‌బాబు విలన్‌గా నటించారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు