మీటూ ఫ్యాషన్‌ అయిపోయింది

22 Nov, 2018 00:17 IST|Sakshi
మోహన్‌లాల్‌

‘మీటూ’ ఉద్యమానికి చాలామంది నటీనటులు మద్దతు తెలుపుతుంటే మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ మాత్రం ‘మీటూ’ను మూణ్ణాళ్ల ముచ్చటగా సంబోధించారు. దుబాయ్‌లో జరగబోయే మలయాళ యాక్టర్స్‌ ఛారిటీ ఈవెంట్‌ గురించి మాట్లాడటానికి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ‘అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌’ (అమ్మ) ప్రెసిడెంట్‌గా మోహన్‌లాల్‌ ‘మీటూ’ గురించి మాట్లాడారు. ‘‘మలయాళ ఇండస్ట్రీలో ఎటువంటి సమస్యా లేదు. లైంగిక వేధింపులు ఎక్కడైనా జరుగుతాయి.

కేవలం సినిమా ఇండస్ట్రీలో అని అనుకోవడం కరెక్ట్‌ కాదు. అయినా ‘మీటూ’ అనేది ఓ ఫ్యాషన్‌లా తయారైంది. ఇలాంటివి ఎక్కువ కాలం నిలబడలేవు. కేవలం మూణ్ణాళ్ల ముచ్చట అవుతాయి. అయినా ‘మీటూ’ మీద నేను కామెంట్‌ చేయలేను. దాన్ని అనుభవిస్తేగాని మాట్లాడకూడదు’’ అని పేర్కొన్నారు. అలాగే లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటుడు దిలీప్‌ ఈ వేడుకలకు హాజరవుతారా? అని అడగ్గా – ‘‘దిలీప్‌ ‘అమ్మ’లో సభ్యుడు కాదు కాబట్టి హాజరుకారు’ అని సమాధానం ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు