సూపర్ స్టార్ పెళ్లిరోజు నేడు

28 Apr, 2016 11:19 IST|Sakshi
సూపర్ స్టార్ పెళ్లిరోజు నేడు

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన 28వ పెళ్లి రోజును వియత్నాంలో జరుపుకుంటున్నారు. ఈ రోజు(ఏప్రిల్ 28) తమ పెళ్లి రోజును వియత్నాంలో సన్నిహిత మిత్రుల సమక్షంలో సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు మోహన్ లాల్  సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 28 ఏళ్ల తమ దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా సాగిందని పేర్కొన్నారు. భార్య సుచిత్రా బాలాజీతో తాను కలిసివున్న క్లోజప్ ఫొటోను ట్విటర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

వీరిద్దరూ 1988, ఏప్రిల్ 28న వివాహం చేసుకున్నారు. మోహన్ లాల్ తెలుగులో 'జనతా గ్యారేజ్' సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. మలయాళంలో ఆయన తాజా చిత్రం 'పులి మురుగున్' జూలైలో విడుదల కానుంది.