ఆధ్యాత్మిక వేత్తగా మోహన్ లాల్..?

17 Sep, 2016 10:39 IST|Sakshi
ఆధ్యాత్మిక వేత్తగా మోహన్ లాల్..?

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరో విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. కమర్షియల్ హీరోగా కొనసాగుతూనే ప్రయోగాత్మక పాత్రలు చేస్తున్న ఈ కంప్లీట్ యాక్టర్, ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక తత్వవేత్త ఓషో పాత్రో నటించనున్నాడన్న వార్త ఇప్పుడు మాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ సినిమాపై ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. మోహన్ లాల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోతో చర్చ మొదలైంది.

ట్విట్టర్ పేజ్లో తాను ఓషో వేషదారణలో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన మోహన్ లాల్, 'ఆధ్యంతాలు లేని వ్యక్తి వేషంలో.. సముద్రమంత ప్రేమతో..' అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం నార్త్ సౌత్ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుండటంతో మోహన్ లాల్ కూడా ఓషో బయోపిక్ ను తెరకెక్కించనున్నాడన్న టాక్ మొదలైంది. సినిమా పై ఎలాంటి ప్రకటన లేకపోయినా.. మోహన్ లాల్ గెటప్ కు మాత్రం మంచి స్పందన వస్తోంది.

Load Comments
Hide Comments
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..

అదో బోరింగ్‌ టాపిక్‌

తోట బావి వద్ద...

ఏంట్రా ఈ హింస అనుకున్నాను!