మన్యంపులి లాగే ఆదరిస్తారని ఆశిస్తున్నా – మోహన్‌లాల్‌

6 Mar, 2018 01:22 IST|Sakshi
మేజర్‌ రవి, మోహన్‌లాల్, ఎన్‌. బాలాజీ

ఇండో–పాక్‌ బోర్డర్‌లో 1971లో జరిగిన ఇన్సిడెంట్స్‌ ఆధారంగా మలయాళంలో రూపొందిన చిత్రం ‘1971 బియాండ్‌ బోర్డర్స్‌’. మోహన్‌లాల్, అల్లు శిరీష్‌ ముఖ్య తారలుగా మేజర్‌ రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ‘యుద్ధభూమి’ పేరుతో జాష్‌ రాజ్‌ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై ఎన్‌.బాలాజీ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం మోహన్‌లాల్‌ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు మేజర్‌ రవికి దేశభక్తి ఎక్కువ.

ఆర్మీలో పని చేయడంతో ఆ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటికే పది సినిమాలు తీశారు. అందులో 5 సినిమాలు నాతోనే తీశారు. అల్లు శిరీష్‌ ఎనర్జిటిక్‌ ఫెర్ఫార్మెన్స్‌ చూపించాడు. తనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ‘మన్యం పులి’ సినిమాలాగే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మన సైనికులకు దేశ భక్తి ఉన్నట్టే ఆ దేశ సైనికులకు కూడా దేశభక్తి ఉంటుంది.

ఇలా ఇరు దేశ సైనికుల భావోద్వేగాలను చూపించాం. మోహన్‌లాల్, శిరీష్‌ అద్భుతంగా నటించారు. ఎన్‌.బాలాజీ గారు తెలుగులో రిలీజ్‌ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మేజర్‌ రవి. ‘‘ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు ఫైనల్‌ స్టేజిలో ఉన్నాయి. మన నేటివిటీకి తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా డబ్‌ చేస్తున్నాం. త్వరలో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ ఏర్పాటు చేస్తాం. మేజర్‌ రవి, మోహన్‌లాల్, అల్లు శిరీష్, హాజరు కానున్నారు’’ అని నిర్మాత బాలాజీ అన్నారు.

మరిన్ని వార్తలు