మాకు కరోనా పాజిటివ్‌గా తేలింది: నటి

1 Jun, 2020 19:35 IST|Sakshi

ముంబై: ‘యెహ్‌ రిష్తా క్యా కెహల్తా హై’ ఫేం నటి మోహనా కుమారి సింగ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా మోహనా కుమారి మాట్లాడుతూ.. ‘ఇది నిజం. నాకు, నా కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం మేమందరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాము. మాకు కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని.. త్వరలోనే కోలుకుంటామని వైద్యులు తెలిపారు. మేము అదే నమ్ముతున్నాం’ అన్నారు. తొలుత ఆమె అత్త అమృత రావత్‌ కరోనా బారిన పడ్డారు.

ఆమెను రిషికేశ్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. మోహనా కుటుంబంలో పని చేస్తున్న వారికి కూడా కరోనా పాజిటటివ్‌గా తేలడంతో వారంతా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో మోహనా ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పాల్‌ మహారాజ్‌ కుమారుడు సుయేష్ రావత్‌ని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన భర్త, కుటుంబంతో కలిసి డెహ్రాడూన్‌లో నివసిస్తోంది. (ప్ర‌ముఖ‌ సంగీత ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు