సుధీర్‌బాబు ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నాడు : దాసరి

27 Apr, 2015 23:57 IST|Sakshi
సుధీర్‌బాబు ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నాడు : దాసరి

 ‘‘సుధీర్ బాబు ఈ టైటిల్‌తో సినిమా తీస్తున్నాడంటే కచ్చితంగా ఓ కౌబాయ్ సినిమా అనుకున్నా. కానీ ఇది ఓ డిఫరెంట్ స్టోరీ అని సుధీర్ చెప్పాడు. ఒక్కో సినిమాకు సుధీర్ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నాడు. మా చెల్లాయి విజయనిర్మల బాల నటిగా కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లయింది. రచ యితగా నాకు కూడా 50 ఏళ్లు పూర్తయ్యాయి’’ అని డా. దాసరి నారాయణరావు చె ప్పారు లక్ష్మీ న రసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’.
 
 బోస్ నె ల్లూరి దర్శకుడు. మణికాంత్ కద్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దాసరి నారాయణరావు, కృష్ణ, విజయనిర్మల పాటల సీడీను ఆవిష్కరించి చిత్ర సమర్పకులు శంకర్ చిగురుపాటికి అందజేశారు. హీరో కృష్ణ మాట్లాడుతూ -‘‘ఇది చాలా మంచి టైటిల్. సుధీర్‌బాబు లుక్ డిఫరెంట్‌గా ఉంది. పాటలు, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘కృష్ణగారి ‘మోసగాళ్లకు మోసగాడు’ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ చిత్రం అంత పెద్ద హిట్ అవ్వాలి’’ అని విజయనిర్మల అన్నారు.
 
  సుధీర్‌బాబు మాట్లాడుతూ - ‘‘మహేశ్‌బాబు రాలేదేంటని చాలా మంది అడిగారు. ఆయన షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. కానీ చాలా మంది మహేశ్ (అభిమానులు)లు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారని తర్వాత తెలిసింది. ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎంటర్ టైనర్. పాటలు చాలా బాగా వచ్చాయి’’ అని చెప్పారు. ఈ వేడుకలో బొత్స సత్యనారాయణ, హీరోలు శ్రీకాంత్, సుశాంత్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి