బ్యాచ్‌లర్‌ వస్తున్నాడు

2 Mar, 2020 05:25 IST|Sakshi
అఖిల్‌

అఖిల్‌ నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తున్నాం అని ప్రకటించింది చిత్రబృందం. తాజాగా మే 22న ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యారని సమాచారం. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని తొలిపాట ‘మనసే మనసే..’ నేడు విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు